గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో నాలుగోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తంగా ఇప్పటి వరకూ 34 మృతదేహాలు లభించాయి. వీటిని ఒడ్డుకు చేర్చిన అధికారులు అక్కడి నుంచి రాజమహేంద్రవరానికి తరలించారు. గల్లంతైన మిగతా వారి ఆచూకీ కోసం అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు..బోటు ప్రమాదంలో చనిపోయిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరి మృతదేహాలను శవపరీక్ష అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. రాజమహేంద్రవరం నుంచి కుటుంబసభ్యులు ఇద్దరి మృతదేహాలు హైదరాబాద్ తరలించారు.
వివరాలు...
నంద్యాలకు చెందిన మహేశ్వర్‌రెడ్డి ,వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండకు చెందిన రాజేంద్రప్రసాద్, ప.గో. జిల్లా పెదపాడు మం. అప్పనవీడు వాసి, అప్పన్నవీడుకు చెందిన నడికుదురు శ్రీనివాసరావు , హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన మహమ్మద్ తాలిబ్ పటేల్, విశాఖ జిల్లా అనకాపల్లి మం. గోపాలపురం వాసి పెద్దిరెడ్లి దాలమ్మ లగా మృతదేహాలను గుర్తించారు.