Nannaya University BCom Exams: తూర్పు గోదావరి జిల్లాలో బీకాం పరీక్షల్లో గందరగోళం నెలకొంది. నన్నయ వర్సిటీ పరిధిలోని బీకాం వెబ్‌టెక్నాలజీ పరీక్షను రద్దు అధికారులు రద్దు చేశారు. సిలబస్‌లో లేని ప్రశ్నలు రావడంతో ఇవాళ జరగాల్సిన బీకాం ఐదో సెమిస్టర్ వెబ్ టెక్నాలజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష పేపర్ విద్యార్థులకు ఇవ్వకముందే గుర్తించిన వర్సిటీ అధికారులు.. ఈ పరీక్షను రద్దు చేశారు. ఈనెల 25న తిరిగి వెబ్ టెక్నాలజీ పరీక్ష నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు వెల్లడించారు.
డిగ్రీ బీకాం పరీక్షల్లో ప్రశ్నల తారుమారు : రాజమహేంద్రవరం నన్నయ్య వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ బీకాం పరీక్షల్లో ప్రశ్నలు తారుమారయ్యాయి. ఐదో సెమిస్టర్‌లో బీడీపీఎస్‌కు బదులు సీ లాంగ్వేజ్ ప్రశ్నలను పరీక్షల్లో అడగటంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.
ఇదీ చదవండి : స్కూళ్లు తెరిచే నాటికి "విద్యాకానుక".. సబ్జెక్టుల వారీగా టీచర్లు: సీఎం జగన్