మహిళలు తమపై జరుగుతున్న అకృత్యాల గురించి పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయలేకపోతున్నారని హోంమంత్రి సుచరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సైబర్ నేరగాళ్లకు అవకాశంగా మారిందని చెప్పారు. మహిళకు ఏ ఇబ్బంది కలిగినా... 100, 112, 182 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. సాంకేతికత వల్ల అభివృద్ధి చెందాలే తప్ప... ఇబ్బందులు పడకూడదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అభిప్రాయప్డారు. ఈ సదస్సు ద్వారా సైబర్ నేలాల పట్ల అవగాహన కలిగిందని విద్యార్థినులు చెప్పారు.
ఇదీ చదవండి