కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై.. రాజమహేంద్రవరం పోలీసులు.. బుధవారం దాడి చేయడం కలకలం రేపుతోంది. తమ గుర్తింపు కార్డులను చూపించినప్పటికీ.. సీఐ దుర్గా ప్రసాద్, ఇతర సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారంటూ.. నర్సు హేమలత ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ఫ్యూ మాటున పోలీసులు.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. ఏపీఎన్జీవో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సు దంపతులపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని.. డీజీపీ గౌతం సవాంగ్‌ను డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
శభాష్ నాగలక్ష్మీ.. సోనూసూద్ ఫౌండేషన్‌కు నీ సాయం గొప్పది తల్లీ!