తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదికి చెందిన దీపిక అనే మహిళకు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితి సమితి ఆధ్వర్యంలో ఈ నెల 8న మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఆన్‌లైన్‌లో జరిగే సదస్సులో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ మేరకు గ్రీన్‌వార్మ్స్ ప్రతినిధి అక్షయ్ గుండేటి, సఖినేటిపల్లి మండలం కో ఆర్డినేటర్ గంటా సునీల్ శనివారం వెల్లడించారు.
గోదావరి సముద్రతీర ప్రాంతాల్లో కాలుష్య నివారణకు గ్రీన్‌వార్మ్స్, స్మార్ట్‌విలేజ్ మూవ్‌మెంట్ సంస్థల ఆధ్వర్యంలో అంతర్వేదిలో 'జీరో వేస్ట్- అంతర్వేది' ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా సాగర సంగమం, దేవాలయాలు, గ్రామ పరిసర ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి కాలుష్య నివారణ చేయడమే లక్ష్యంగా దీపికాతో పాటు మరో నలుగురు మహిళలను గ్రీన్‌వార్మ్స్ సభ్యులుగా చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తీరంలో కాలుష్య నివారణతో పాటు జీవరాశుల మనుగడ, జాలర్ల జీవనోపాధి వంటి విషయాలపై దీపిక మాటలతో ఓ వీడియో తీసి గ్రీన్‌వార్మ్స్ సంస్థ సభ్యులు ఐక్యరాజ్యసమితికి పంపించారు. ఇలా ప్రపంచంలో పలు దేశాల నుంచి వచ్చిన అంశాలను పరిశీలించిన ఐక్యరాజ్యసమితి మొత్తం 30 మందిని ఎంపిక చేసుకోగా... అందులో మన దేశం నుంచి దీపికకు అవకాశం దక్కింది.
ఇదీ చదవండి:
polavaram: పోలవరం పూర్తి చేసేందుకు వందల కోట్లు కావాలి.. కానీ!