ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

ప్రధాన వార్తలు @ 7 PM

7pm_Topnews
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Mar 22, 2021, 7:00 PM IST

  • ఏకాభిప్రాయానికి రావాలి: సుప్రీం

తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై సుప్రీం విచారణ చేపట్టింది. నెల రోజుల్లో ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే తామే విచారణ చేపడతామని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • పరామర్శ

అదృశ్యమైన విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాస్‌ ఆచూకీ త్వరగా తెలుసుకోవాలని తెదేపా నేత పల్లా శ్రీనివాస్.. పోలీసులకు విజ్ఞప్తి చేశారు. శ్రీనివాస్ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. ధైర్యం చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • అవగాహన ర్యాలీలు

ప్రపంచ జల సంరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అవగాహన ర్యాలీలు చేపట్టారు. నీటిని వృథా చేయకూడదని, భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • లొంగుబాటు

తెలంగాణ లో సంచలనం సృష్టించిన బోయిన్​పల్లి కిడ్నాప్​కేసులో నిందితులు అఖిల ప్రియ సోదరుడు, భర్త పోలీసులకు లొంగిపోయారు. ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న భార్గవరామ్​, జగత్ విఖ్యాత్​ రెడ్డి... ​బోయిన్‌పల్లి పీఎస్‌లో లొంగిపోయారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • తవ్వకాల్లో సీతా దేవి వస్తువులు!

అయోధ్య రామమందిర నిర్మాణానికి చేపట్టిన తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడ్డాయి. అందులో విరిగిన విగ్రహాలు సహా సీతా దేవి వంట గదిలోని సామాన్లు ఉన్నట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'అదే ప్రజల కోరిక'

అసోం ఒప్పందాన్ని కాపాడేందుకు సీఏఏ వ్యతిరేక పార్టీలు కలిసికట్టుగా రావాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయి. ప్రజల్లో తమ గ్రాఫ్​ పెరుగుతోందని.. భాజపా గ్రాఫ్ పూర్తిగా పడిపోతోందని పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తమ కూటమికి ప్రజల ఆశీర్వాదం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'సామర్థ్యం 79 శాతం'

తమ టీకా సామర్థ్యం 79 శాతంగా ఉందని ప్రకటించింది ఆస్ట్రాజెనెకా. అమెరికాలో చేపట్టిన అడ్వాన్స్​డ్​ ట్రయల్ ఫలితాలను సోమవారం వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆదరణ తక్కువే!

కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఇటీవల తుక్కు పాలసీని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకం ఉద్దేశం, లక్ష్యం బాగున్నప్పటికీ.. ఎక్కువ మంది ఈ పాలసీని వినియోగించుకునే అవకాశం లేదని ఓ నివేదిక అభిప్రాయపడింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఏ స్థానానికైనా రెడీ'

టీ20ల్లో ఓపెనింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. యువ బ్యాట్స్​మెన్​ సూర్య కుమార్ యాదవ్​ ఇదే విధంగా ఆడితే తాను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్​కు దిగేందుకు సిద్ధమని పేర్కొన్నాడు. రానున్న ఐపీఎల్​లోనూ ఓపెనర్​గా బ్యాటింగ్​కు దిగుతానని స్పష్టం చేశాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • విజేతలు వీరే

67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నాని 'జెర్సీ', ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్​బాబు 'మహర్షి' అవార్డులు దక్కాయి. ఉత్తమ హిందీ చిత్రంగా సుశాంత్​ సింగ్​ 'చిచ్చోరె' నిలిచింది. ఉత్తమ నటుడిగా ధనుష్​, ఉత్తమ నటిగా కంగనా రనౌత్​కు జాతీయ అవార్డు వరించింది. ఇంకా ఏఏ చిత్రాలను, ఎవరెవరికి అవార్డులు దక్కాయో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.