ETV Bharat / city

Zoology Museum: జువాలజీ మ్యూజియం.. ఎక్కడో తెలుసా?

Zoology Museum: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావిధానంలో ప్రయోగాత్మక బోధనకు పెద్దపీట వేస్తున్నారు. నేటి పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రయోగాత్మక రీతిలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ తరహా బోధన సైన్స్​ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. అయితే ఒకప్పుడు ప్రయోగశాల జాడే లేదు. ఇక మ్యూజియంల ఊసు అసలే లేదు. ఇప్పటికీ చాలా చోట్ల ల్యాబ్​లే అందుబాటులో లేవు. అటువంటిది ఒక మహిళా డిగ్రీ కళాశాలలో ఉన్న మ్యూజియం చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. మరి దాని విశేషాలు మనమూ తెలుసుకుందామా?

Zoology Museum
జువాలజీ మ్యూజియం
author img

By

Published : Mar 18, 2022, 6:49 PM IST

జువాలజీ మ్యూజియం

Zoology Museum: మారుతున్న విద్యావిధానంలో ప్రయోగాత్మక బోధనకు పెద్దపీట వేస్తున్నారు. సైన్స్‌ విద్యార్థులకు ఈ తరహా బోధన ఎంతో అవసరం. కానీ ఒకప్పుడు కళాశాల్లో అసలు ప్రయోగశాలలు ఉండేవి కావు. మ్యూజియంల ఊసే లేదు. ఇప్పటికీ చాలా కళాశాలల్లో సరైన ల్యాబ్‌లు అందుబాటులో లేవంటే అతిశయోక్తి కాదు. అటువంటిది.. నెల్లూరులోని దొడ్ల కౌసల్యమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో.. ఉన్న జువాలజీ మ్యూజియం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ మ్యూజియం విశేషాలు మనమూ చూసేద్దాం.

1964లో నెల్లూరులో దొడ్ల కౌసల్యమ్మ డిగ్రీ కళాశాల ఏర్పాటైంది. అదే సమయంలో కళాశాలలో అద్భుతమైన ల్యాబ్స్‌, జువాలజీ విభాగానికి సంబంధించి ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. మ్యూజియంలో అరుదైన జీవ జాతులకు సంబంధించి స్పెసిమెన్స్, ట్యాక్సీడెర్మీసెక్షన్‌ కూడా ఉంది. వందల సంఖ్యలో సేకరించి భద్రపరిచిన జీవజాతులను చూసేందుకు జిల్లాలోని విద్యార్థులే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఈ కళాశాలలో జీవ, జంతు, రసాయన శాస్త్రాలకు సంబంధించి ప్రయోగశాలలను.. అధునాతన సౌకర్యాలతో నిర్వహిస్తున్నారు.

జీవ, జంతు, రసాయన శాస్త్ర విభాగాలకు సంబంధించి తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో కోర్సులను అందిస్తున్నట్లు జువాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ శ్రీరంజనీ తెలిపారు. 2017నుంచి అక్వాకల్చర్ జువాలజీ కోర్సును ప్రారంభించినట్లు చెప్పారు. 2019 నుంచి పోస్ట్ గ్రాడ్యూయేషన్ కోర్సులు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తరగతి గదిలో పాఠాలు విన్నప్పటికీ ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవటం వల్ల మరింత విషయ పరిజ్ఞానాన్ని పొందవచ్చని విద్యార్థినులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇలాంటి జువాలజీ మ్యూజియం మరెక్కడా లేదని విద్యార్ధులు గర్వంగా చెబుతున్నారు.

ఇదీ చదవండి: TDP Leaders: మద్యపాన నిషేధం పేరిట వైకాపా ప్రభుత్వం మోసం..: తెదేపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.