Unauthorised layouts: నెల్లూరు గ్రామీణ ప్రాంతంలోని కోడూరుపాడు పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున రియల్ దందా జరుగుతోంది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి, వెంచర్లుగా మార్చేసి వ్యాపారం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్రమ లేఅవుట్లు వేశారంటూ వైకాపా నాయకుడు ఆనం విజయ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయన స్థానికులు ఆరోపిస్తున్నారు. 25 ఏళ్ల కిందటి కాలువ పూడిపోవడాన్ని అవకాశంగా తీసుకుని రోడ్లు వేస్తున్నారంటూ రియల్ వ్యాపారులను నిలదీశారు.
నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తూ చుట్టూ గోడలు కట్టడం, ఆర్చిల నిర్మాణం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోడూరుపాడులోనే ఒక పేపర్ మిల్లు వద్ద వేస్తున్న లేఅవుట్ పై ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. పొట్టేపాలెం వద్ద కూడా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నరసింహస్వామి ఆలయానికి వెళ్లే వైపు డొంకను కూడా మూసివేశారు. కోడూరుపాడులో 6ఎకరాలకుపైగా స్థలాన్ని ఆక్రమించినా అధికారులు పట్టించుకోవడంలేదని ఆనం విజయకుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఆక్రమణలపై ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయాలని తప్ప.. వెంచర్లన్నీ అలాంటివే అనే ఆరోపోణలు సరికాదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లపై అధికారులు తగిన దృష్టి పెట్టాలని.. లేదంటే అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలు మోసపోతారని అంటున్నారు.
ఇదీ చదవండి: భారత్ బయోటెక్ 'చుక్కల టీకా' ట్రయల్స్‌కు అనుమతి