Robbery: నెల్లూరు జిల్లా మర్రిపాడులో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కండ్రిక నుంచి మర్రిపాడుకు వస్తున్న ఓబుల్ రెడ్డి అనే వ్యక్తిని ఇద్దరు దారి దోపిడీ దొంగలు బురిడీ కొట్టించారు. దారి దోపిడీలపై వాహనదారులకు అవగాహన కల్పింస్తున్నామంటూ.. అధికారుల వేషంలో వచ్చి నమ్మించారు. ఇందులో భాగంగా.. మీ దగ్గర ఉన్న నగదును, బంగారాన్ని తీసి బైక్ బాక్స్‌లో వేయాలని ఓబుల్ రెడ్డికి చెప్పారు. వాళ్లను నమ్మిన అతడు తన రెండు ఉంగరాలను, నగదును తన బైక్ బాక్సులో వేశాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసి దొంగలు ఉడాయించారు. మోసపోయానని గుర్తించిన ఓబుల్ రెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. రెండు ఉంగరాలు సుమారు రెండు సవర్లు ఉంటాయని బాధితుడు తెలిపాడు.
ఇదీ చదవండి: కర్నూలులో దారుణం.. ఆస్తి కోసం బాలికకు పురుగు మందు తాగించిన పెదనాన్న
అధికారులమంటూ వచ్చారు.. ఉంగరాలు దోచుకెళ్లారు..!
దారి దోపిడీ దొంగలు సైతం.. దొంగతనాల్లో కొత్త పద్ధతులు అవలంభిస్తున్నారు. దొంగతనాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మాములుగా వస్తే స్థానికులు గుర్తుపట్టి పోలీసులకు అప్పగిస్తున్నారు. అందుకే.. అధికారుల వేషం వేసుకుంటున్నారు..!