ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

top news @ 3 pm
ప్రధాన వార్తలు @ 3 pm
author img

By

Published : Mar 17, 2021, 3:10 PM IST

  • రసవత్తరం
    మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం సృష్టించింది. అయితే అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది. ప్రజాతీర్పు ప్రకారం పీఠంపై కూర్చోవాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా ఛైర్మన్ పదవి దక్కించుకోవాలని అధికారపక్షం పట్టుదలగా ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • సీఎం కాన్వాయ్ కి నినాదాల సెగ
    రాష్ట్ర మానవహక్కుల సంఘం ఛైర్మన్‌, సభ్యుల ఎంపిక కోసం సచివాలయానికి.. వచ్చిన సీఎంకు అమరావతి రైతులు మరోసారి నిరసన తెలిపారు. జగన్ వాహనశ్రేణి వెలగపూడి సచివాలయానికి వెళ్తుండగా.. రైతులు జై అమరావతి నినాదాలు చేశారు. రైతులు రహదారిపైకి రాకుండా ఉండేందుకు పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రేపే మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక
    రేపు కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. సామాజిక సమీకరణాల మేరకు అభ్యర్థుల జాబితాను వైకాపా సిద్ధం చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • మాజీ మంత్రికి సీఐడీ నోటీసులు
    మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. కూకట్‌పల్లిలోని నారాయణ నివాసంలో అధికారులు నోటీసులు అందజేశారు. మరోవైపు నెల్లూరులో సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • టీకాల వృథాపై మోదీ ఆందోళన
    తెలుగు రాష్ట్రాల్లో 10 శాతం వ్యాక్సిన్లు వృథా అవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. టీకాలు ఎందుకు వృథా అవుతున్నాయో ఆయా రాష్ట్రాలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఆ వార్తలు అవాస్తవం'
    ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్​ అంబానీ సతీమణి నీతా అంబానీని విజిటింగ్​ ప్రొఫెసర్​గా రావాలని బెనారస్​ హిందూ విశ్వవిద్యాలయం ఆహ్వానం పంపిందన్న వార్తలు నిజం కావని రిలయన్స్​ ఇండస్ట్రీస్​ స్పష్టం చేసింది. తమకు అసలు అలాంటి ప్రతిపాదనేదీ రాలేదని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అధికారులపై ఆంక్షలు
    అమెరికా విదేశాంగ శాఖ.. చైనా, హాంకాంగ్​కు చెందిన 24 మంది అధికారులపై ఆంక్షలు విధించింది. హాంకాంగ్​ ఎన్నికల వ్యవస్థను చైనా అస్తవ్యస్తం చేయాలని ప్రయత్నిస్తోందని అగ్రరాజ్యం ఆరోపించింది. ఆంక్షలు విధించాలన్న నిర్ణయం చైనా వైఖరిపై తమ వ్యతిరేకత తెలియజేస్తుందని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • పిల్లల కోసం ప్రత్యేక సేల్
    కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. దీనితో పిల్లలకు వారి తల్లిదండ్రులు నోట్​బుక్స్, బ్యాగ్​లు, ఇతర వస్తువులు కొనడం సహజమే. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్​ 'కిడ్స్ కార్నివల్​' పేరుతో ప్రత్యేక సేల్​ను ప్రారంభించింది. ఈ ఆఫర్​లోని బెస్ట్ డీల్స్​ వివరాలు మీ కోసం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఆయన ఎనర్జీకే పవర్​హౌస్
    టాలీవుడ్​ అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణపై హీరోయిన్​ ప్రగ్యా జైశ్వాల్​ ప్రశంసలు కురిపించారు. బాలయ్య ఎనర్జీకి పవర్​హౌస్​ లాంటి వారని ఆమె అన్నారు. సినిమా పట్ల బాలకృష్ణకు ఉన్న అభిరుచికి ఎవరూ సాటిరారని ప్రగ్యా తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.