ETV Bharat / city

బెదిరింపులు తట్టుకోలేక టిట్​టాక్​ స్టార్ రఫీ ఆత్మహత్య

author img

By

Published : Jan 24, 2021, 8:46 PM IST

నెల్లూరుకు చెందిన టిక్​టాక్​ స్టార్ రఫీ.. మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నాడు. తన ప్రేయసి అతడితో చనువుగా ఉంటుందంటూ.. రఫీపై నారాయణరెడ్డి పేటకు చెందిన ముస్తఫా కొంతకాలం క్రితం దాడి చేశాడు. అనేకమార్లు బెదిరిస్తుండటంతో మనస్థాపానికి గురై.. తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని రఫీ ఆత్మహత్య చేసుకున్నాడు.

tiktok star rafi suicide in nellore
నెల్లూరులో టిక్​టాక్​ స్టార్​ రఫీ ఆత్మహత్య

టిక్ టాక్ స్టార్ రఫీ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాయకులపేట దగ్గరున్న తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం రఫీపై దాడి జరగడం.. వారు బెదిరింపులకు పాల్పడటం వల్లే మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

నారాయణరెడ్డి పేటకు చెందిన రఫీ మిత్రుడు ముస్తఫా.. ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు నెలలుగా ఆ యువతి రఫీతో చనువుగా ఉండటంతో.. పథకం ప్రకారం ముస్తఫా దాడికి పాల్పడ్డాడు. విచక్షణా రహితంగా రఫీపై దాడి చేసి.. విషయం బయటికి చెబితే అంతు చూస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తుండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఇదీ చదవండి: విద్యార్థిపై కండక్టర్​ దాడి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.