ETV Bharat / city

ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదంలో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి - crime news

నెల్లూరు జిల్లా గూడూరు ఆదిశంకరా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా.. మరొకరు నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ACCIDENT at gudur
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
author img

By

Published : Jul 5, 2021, 12:33 AM IST

తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా.. నెల్లూరు జిల్లా గూడూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఓ కారు బలంగా ఢీ కొట్టడం జరిగింది. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో.. నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.

గూడూరు ఆదిశంకరా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయరహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. సింగిల్ రోడ్డు కావడం వల్ల తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడంతో.. ముందు వెళుతున్న లారీ ఒక్కసారిగా సడన్​ బ్రేక్​ వేయడం వల్ల కారు లారీని ఢీకొంది. అదే సమయంలో కారు వెనుకగా వచ్చిన మరో లారీ.. ఆ కారును బలంగా ఢీ కొట్టడంతో కార్ రెండు లారీలు మధ్య నుజ్జు నుజ్జు అయింది.

ఈ ప్రమాదంలో కారు లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతులు వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతి తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామం చెందిన వారుగా గుర్తించారు. లిఖిత అనే మరో యువతికి తీవ్ర గాయాలతో ప్రస్తుతం నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఇదీ చదవండి:

4 రోజులైంది అడవిలో తప్పిపోయి.. ఎక్కడున్నాడో.. ఎలా ఉన్నాడో..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.