ETV Bharat / city

'మోదీ మెప్పు కోసమే వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చారు' - Shilajanath comments on TDP

సీఎం జగన్ రైతు వ్యతిరేకిగా మారారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. మోదీ మెప్పు కోసమే కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు తెదేపా, వైకాపా మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. నెల్లూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.

PCC Chief Shilajanath fires on jagan over meters fix
శైలజానాథ్
author img

By

Published : Oct 20, 2020, 4:34 PM IST

ముఖ్యమంత్రి జగన్ రైతు వ్యతిరేకిగా నిలిచారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. రైతు ప్రయోజనాలను పణంగా పెట్టి, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెప్పు కోసం వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చారని దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలోని ఇందిరా భవన్​లో కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమైన శైలజానాథ్.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా రెండు కోట్ల సంతకాలు సేకరించనున్నట్లు ఆయన ప్రకటించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 31వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహ దీక్ష చేపడుతామని స్పష్టం చేశారు. కార్పొరేట్ వ్యక్తుల ప్రయోజనాల కోసమే కేంద్రం వ్యవసాయ బిల్లును తీసుకువస్తే... వైకాపా, తెదేపాలు మద్దతు ఇవ్వడం దుర్మార్గమన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియను అడ్డుకుంటామని ఉద్ఘాటించారు.

ఇదీ చదవండీ.. పోలవరం అంచనాలపై కొత్త కొర్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.