ETV Bharat / city

ANIMAL AMBULANCE: సంచార పశుఆరోగ్య సేవా రథాలకు 'ఆదిలోనే హంసపాదు' - వైఎస్‌ఆర్‌ సంచార పశుఆరోగ్య సేవా రథాలకు ఆదిలోనే హంసపాదు

ANIMAL AMBULANCE: ముఖ్యమంత్రి జగన్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించిన సంచార పశు ఆరోగ్య సేవ పథకం.. పక్షం రోజులు కాకముందే కొన్నిచోట్ల మూలనపడింది. సేవలు ఎక్కువ, తమకిచ్చే జీతాలు తక్కువంటూ కొందరు వైద్యులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో చాలాచోట్ల వాహనాల ద్వారా అందించాల్సిన పశు వైద్య సేవలు నిలిచిపోయాయి.

ANIMAL AMBULANCE
పశువుల అంబులెన్సులకు ఆదిలోనే హంసపాదు
author img

By

Published : May 31, 2022, 1:32 PM IST

పశువుల అంబులెన్సులకు ఆదిలోనే హంసపాదు

ANIMAL AMBULANCE: రాష్ట్రంలో 278 కోట్ల రూపాయల వ్యయంతో 340 పశువుల అంబులెన్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. తొలిదశలో 143 కోట్ల రూపాయల వ్యయంతో 175 అంబులెన్సుల ద్వారా సేవలను మే 19న ముఖ్యమంత్రి ప్రారంభించారు. వీటిని నియోజకవర్గానికి ఒకటి చొప్పున కేటాయించారు. పశువైద్య అంబులెన్సుల నిర్వహణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు భరిస్తాయి. ఒక్కో వాహనంలో పశు వైద్యుడు, డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండరు ఉంటారు. వైద్యుడికి 40వేల రూపాయలు, సహాయుడికి 17 వేల 500 రూపాయలు, డ్రైవరుకు 13 వేల 280 చొప్పున చెల్లిస్తారు. ఇందులోనే బీమా, పీఎఫ్‌ వంటి సౌకర్యాలుంటాయి.

ఏడాదికి 15 శాతం చొప్పున ఇంక్రిమెంట్‌ ఇస్తారని నిబంధనల్లో పేర్కొన్నారు. తొలిదశలో కేటాయించిన 175 అంబులెన్సుల నిర్వహణ, పశు వైద్య సేవలు అందించేందుకు రెండేళ్ల కాలానికి పశు సంవర్ధకశాఖ టెండర్లను ఆహ్వానించగా.. జీవీకే అత్యవసర సేవల నిర్వహణ, పరిశోధన సంస్థ దక్కించుకుంది. ఒక్కో అంబులెన్సు నిర్వహణకు నెలకు లక్షా 67 వేల 787 చొప్పున చెల్లించేలా ఒప్పందం కుదిరింది. పశువులు, మేకలు, గొర్రెలు, పెంపుడు జంతువులకు ప్రాథమిక వైద్యసేవలతోపాటు చిన్న శస్త్ర చికిత్సలు చేసేందుకు వీలుగా వీటిలో ఏర్పాట్లు చేశారు.

ఖాళీ సమయాల్లో ఆర్‌బీకేల వద్ద నిలిపి సేవలందించాలనే విషయం తమకు చెప్పలేదని వైద్యులు పేర్కొంటున్నారు. జీతాలూ చాలా తక్కువగా ఉన్నాయని, 40వేలని చెబుతున్నా చేతికొచ్చేది 32వేల రూపాయలే అనేది వారి వాదనగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మొత్తం కంటే తక్కువగా ఇస్తున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. దీంతో అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, విజయనగరం తదితర జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో కొందరు వైద్యులు విధులకు హాజరు కావడం లేదు.

దీంతో పశు సంవర్ధకశాఖ అధికారులు రంగంలోకి దిగి వారితో మాట్లాడటంతో పారావెట్‌ సిబ్బందితోపాటు కొందరు వైద్యులు విధులకు హాజరవుతున్నట్లు చెబుతున్నారు. మరికొందరు వైద్యులు జీతాలు పెంచాలనే డిమాండుతో విధులకు రావడం లేదు. వైద్యుడు లేకుండా పారావెట్‌, డ్రైవరే అందుబాటులో ఉన్నచోట.. జబ్బున పడిన పశువుల్ని సంచార వాహనాల్లో సమీప ఆసుపత్రులకు తీసుకెళ్తున్నారు. మొత్తంగా 175 నియోజకవర్గాలకు అంబులెన్సులు ఉండగా.. ప్రస్తుతం కొన్నిచోట్ల వాహనాల్లో సేవలందే పరిస్థితి లేదని చెబుతున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.