నెల్లూరులో పెన్నా నది పరవళ్లు తొక్కుతోంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదనీరు.. నగరంలో ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాథ స్వామి ఆలయాన్ని చుట్టుముట్టింది. గర్భాలయంలోకి నదీ జలాలు ప్రవేశించాయి. ప్రస్తుతం మోకాళ్లలోతు నీరు ఆలయంలోకి చేరింది. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడిని పరిశీలించి.. స్వామి వారికి పూజలు నిర్వహించారు.
సోమశిల జలాశయం నుంచి 3 లక్షల 69 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తుండగా.. పెన్నా నది వద్ద 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవహిస్తోంది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇదీ చదవండి: