నెల్లూరు స్వర్ణాల చెరువు చెత్తా చెదారంతో నిండిపోయింది. వ్యర్థాలతో అపరిశుభ్రంగా మారింది. రొట్టెల పండుగ మూడు రోజుల్లో చూపించే శ్రద్ధ తర్వాత ఉండటంలేదని స్థానికులు చెబుతున్నారు. ఏడాది నుంచి స్వర్ణాల చెరువు, చుట్టూ ఉండే పార్కు నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
లాక్డౌన్తో రెండు నెలలుగా కనీసం పార్కులోని మొక్కలకు నీరు కూడా పోయడంలేదని స్థానికులు అంటున్నారు. ఒకప్పుడు పచ్చగా ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం వెలవెలబోతుంది. గత ప్రభుత్వ హయాంలో పార్కు సుందరీకరణ పనులు చేశారు. అనంతరం అధికారుల నిర్లక్ష్యంతో పార్కు పశువులకు నివాసంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది.
ఇదీ చదవండి : యువసైన్యం.. అన్నార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యం..!