ETV Bharat / city

'లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

author img

By

Published : Mar 26, 2020, 8:02 PM IST

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని చర్యలు చేపట్టామని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. నెల్లూరు సర్వజన వైద్యశాలను కొవిడ్-19 కేసుల కోసం సిద్ధం చేశామన్నారు. కరోనా ప్రభావంపై గ్రామ, వార్డు వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్​ఎమ్​లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో అమలు చేస్తున్న కరోనా నివారణ చర్యలపై కలెక్టర్​ ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

Nellor collector interview on covid preventive actions
నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు
ఈటీవీ భారత్​తో మాట్లాడిన నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు

లాక్​డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్​ శేషగిరిబాబు చెప్పారు. కేసులు పెట్టి, అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఐసోలేషన్ వార్డులతో నెల్లూరు సర్వజన వైద్యశాలను కొవిడ్-19గా పేరు మార్చామని తెలిపారు. ఆసుపత్రిలో నూతన బ్లాక్స్​ను సిద్ధం చేస్తున్నామన్నారు. కేసుల సంఖ్య పెరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జిల్లాలో 15 వేల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఆరు వేల మంది ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్​లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారని స్పష్టం చేశారు. కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా ఏడు వందల స్ప్రేయర్లు ఏర్పాటు చేశామని కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు.

ఇదీ చదవండి:

'కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం.. జాగ్రత్తగా ఉందాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.