నెల్లూరు నగర నియోజకవర్గంలో తొమ్మిది అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరంలోని పొగతోట, నర్తకి సెంటర్ ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. 80 లక్షల రూపాయల వ్యయంతో (ఒక్కోదానికి) అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నగర రూపురేఖలు మార్చేలా అభివృద్ధి పనులు చేపడుతామని చెప్పారు. ప్రధాన రహదారుల వెంట ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేయడంతో పాటు... నర్తకి సెంటర్ రహదారిని మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండీ... తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం