నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని... జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. జగన్ ముఖ్యమంత్రి కావడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వరద నీటితో నిండుతుండటం ఫలితంగా... పంటలకు ఇబ్బంది లేకుండా నీరు అందిస్తామన్నారు.
శ్రీశైలం నుంచి ఇప్పటికే 125 టీఎంసీల వరద నీటిని రాయలసీమకు తరలించామని తెలిపారు. సోమశిల జలాశయానికి 30 టీఎంసీలకు పైగా నీటిని తీసుకొచ్చినా... ప్రతిపక్షాలు విమర్శించటం అర్థరహితమన్నారు. నగరంలోని రంగనాయక స్వామి ఆలయం, నవాబుపేట శివాలయాన్ని దర్శించుకున్న మంత్రి... ఈ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు.
ఇదీ చదవండీ... ''వశిష్ఠ పున్నమి'' బోటు యజమాని అరెస్టు