ETV Bharat / city

3,220 కోట్లతో మత్స్యరంగం అభివృద్ధి: మంత్రి మోపిదేవి - నెల్లూరు జిల్లా వార్తలు

మత్స్యరంగం అభివృద్ధికి రూ.3,220 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. బుధవారం ఆయన రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు.

నెల్లూరులో మంత్రులు అనిల్ కుమార్,మోపిదేవి

author img

By

Published : Jun 3, 2020, 11:42 PM IST

Updated : Jun 4, 2020, 5:45 AM IST

నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె వద్ద రూ.300 కోట్లతో నిర్మించనున్న బహుళ ప్రయోజన ఫిషింగ్‌ హార్బర్‌, అల్లూరు మండలం ఇస్కపల్లి వద్ద ఫిష్‌ల్యాండ్‌తో పాటు మినీ ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌, మేజర్‌ ఐస్‌ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్థలాన్ని మంత్రులు మోపిదేవి, అనిల్ కుమార్​ యాదవ్ పరిశీలించారు. ప్రథమంగా ఏర్పాటు చేయబోయే ఈ ఫిషింగ్‌ హార్బర్‌కు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.రెండున్నర ఏళ్ల లోపే నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్స్యకారులు అభివృద్ధి చెందేలా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది ఫిషింగ్‌హార్బర్‌, ఫిష్‌ల్యాండ్‌, ఫిష్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే నెల్లూరులో రూ.2.79 కోట్లతో హోల్‌సేల్‌ చేపల మార్కెట్‌ పునరుద్ధరణ పనులకు మంత్రులు మోపిదేవి, అనిల్‌ బుధవారం శంకుస్థాపన చేశారు.

ఇదీ చదవండి : రాజకీయ రంగులు కుదరవ్..!: సుప్రీం

Last Updated : Jun 4, 2020, 5:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.