నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల పునర్విభజన తుది నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ.. దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్‌కు నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ఆదేశిస్తూ... విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన నెల్లూరు కార్పొరేషన్ వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ.. నెల్లూరుకు చెందిన కే.శ్రీనివాసులు, మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందన్నారు. చట్ట నిబంధనల ప్రకారం తాజాగా వార్డుల పునర్విభజనను చేపట్టి హద్దులను నిర్ణయంచేలా అధికారులను ఆదేశించాలని కోరారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రతివాదులకు నోటీసులిచ్చారు.
ఇదీ చదవండి..
Oath: ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా అడపా శేషగిరిరావు ప్రమాణ స్వీకారం