బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. గత రెండు రోజుల నుంచి తెరిపిచ్చిన వర్షం మళ్లీ మొదలయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతవాసులు ఆందోళన చెదుతున్నారు. వాయుగుండ ప్రభావం జిల్లాపై ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయం కాగా.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ చదవండి: NEDURUMALLI RAM KUMAR REDDY: 'వెంకటగిరి అభివృద్ధికి కృషి చేస్తా'