నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మబ్బులు ఆకాశాన్ని కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో పలుచోట్ల జోరు వర్షం కురిసింది. అకాల వర్షంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడడంతో నెల్లూరు జిల్లాలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మినుము ,పెసర, కంది, ఎడగారు వరి పంట వేసిన రైతులకు మంచిదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరి దున్నే దశలో ఉన్న రైతులకు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయని అధికారులు అన్నారు. ఈ వర్షం ఎంతో మేలు చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ కనక మహల్ సెంటర్ ప్రాంతాలలో రోడ్లు నీటితో జలమయమయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.