ETV Bharat / city

gslv countdown: జీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌ ప్రారంభం

జీఎస్‌ఎల్వీ కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్వీ)-ఎఫ్‌10 వాహక నౌక ప్రయోగానికి సన్నాహక ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది.

gslv countdown
gslv countdown
author img

By

Published : Aug 11, 2021, 7:00 AM IST

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్వీ)-ఎఫ్‌10 వాహక నౌక ప్రయోగానికి సన్నాహక ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. అనంతరం బ్రహ్మప్రకాష్‌ హాల్‌లో మంగళవారం ఉదయం రాకెట్‌ సన్నద్ధత సమావేశం (ఎంఆర్‌ఆర్‌) నిర్వహించారు. దశల వారీగా రాకెట్‌ అనుసంధానంపై సమీక్షించారు. సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు (ల్యాబ్‌) సమావేశంలో ప్రయోగానికి అధికారికంగా అనుమతిచ్చారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమై నిరంతరాయంగా 26 గంటలపాటు కొనసాగనుంది. గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 వాహకనౌక నింగిలోకి దూసుకెళుతుంది. దీని ద్వారా 2,268 కిలోల బరువున్న జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూపరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది.

ఇదీ చదవండి: VIJAYASAI: విజయసాయిరెడ్డికి కోర్టులో చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.