Drip equipment subsidies: మూడు సంవత్సరాల నుంచి ఆగిపోయిన డ్రిప్ పరికరాలపై రాయితీల వివరాలు వెల్లడిస్తూ ప్రభుత్వం నూతనంగా జీవో విడుదల చేసింది. నెల్లూరు జిల్లాలో 6900 హెక్టార్లలో డ్రిప్ పరికరాల ఏర్పాటు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించిందని ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుభాని తెలిపారు. ప్రభుత్వం పరికరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు 90 శాతం రాయితీ, ఐదు ఎకరాల నుంచి 12 ఎకరాలు ఉన్న రైతులకు 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. సన్న, చిన్నకారు, అన్ని కులాల వారికి 50 శాతం రాయితీతో సూక్ష్మ సేద్యం పరికరాలు అందజేసినట్లు ఆయన వివరించారు. నెల్లూరు జిల్లాలో 561 రైతు భరోసా కేంద్రాలలో డ్రిప్ పరికరాలు కావాల్సిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ మొదలైందని, త్వరగా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని సుభాని కోరారు.
ఇవీ చదవండి: