ETV Bharat / city

Suspension: దివ్యాంగ యువకుడి ఆత్మహత్య.. నలుగురు పోలీసుల సస్పెన్షన్ - నెల్లూరు జిల్లా యువకుడి ఆత్మహత్య కేసులో చర్యలు

Suspension: నెల్లూరు జిల్లా మర్రిపాడు వాసి తిరుపతి ఆత్మహత్య కేసులో నలుగురిపై వేటు పడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ సహా నలుగురిపై సస్పెన్షన్‌ విధిస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక విచారణతో ఎస్పీ చర్యలకు ఆదేశించారు.

Suspension
సస్పెన్షన్‌
author img

By

Published : Jul 30, 2022, 10:25 AM IST

Suspension: నెల్లూరు జిల్లా మర్రిపాడు చుంచూలూరు గ్రామానికి చెందిన తిరుపతి ఆత్మహత్య కేసులో నలుగురిపై సస్పెన్షన్‌ విధించారు. ప్రాథమిక విచారణతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐ సహా నలుగురిపై ఎస్పీ చర్యలకు ఆదేశించారు. మర్రిపాడు మండలం చుంచులూరు పంట పోలాల వద్ద తల్లితండ్రులతో కలసి కాపలగా ఉంటున్న దివ్యాంగ యువకుడు తిరుపతయ్యను ఓ చోరీ కేసులో వారంపాటు పోలీసులు వేధించారనే మనస్తాపం పురుగుల మందు తాగి... చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా ఎస్పీ విజయ రామారావు నలుగురిపై చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఐ వెంకటరమణ, ఏఎస్‌ఐ జయరాజ్‌, కానిస్టేబుళ్లు ఎస్‌.కె.చాంద్‌బాషా, సంతోష్‌కుమార్‌లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.