నెల్లూరు జిల్లా పులికాట్ సరస్సులోకి ఇప్పుడిప్పుడే పక్షుల రాక మొదలైంది. చల్లని వాతావరణంలో పులికాట్ సరస్సులో పక్షులు ఆహ్లదకరంగా తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి. వీటిని తిలకించేందుకు సందర్శకులు అక్కడికి చేరుకుంటున్నారు. పులికాట్ సరస్సులోకి వర్షాలతో నీరు చేరుతోంది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ఉండటంతో విదేశీ విహాంగాలు దొరవారిసత్రం మండలం నేలపట్టు పక్షుల సంతానోత్పత్తి కేంద్రానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి వాటి ఆహార బాంఢాగారమైన పులికాట్కు చేరుకుని ఆహారం సేకరించుకుంటున్నాయి.
పులికాట్ మధ్యలో రోడ్డు మార్గాన సముద్రతీరంలో శ్రీ హరికోట ఉండటంతో అంతరిక్ష కేంద్రం నుంచి జరిగే ప్రయోగాలు తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. పక్షుల సంతతి కేంద్రం నేలపట్టుకు సందర్శకులకు అనుమతి లేకపోవడంతో.. పులికాట్ సరస్సు రోడ్డు మార్గంలో పక్షులను వీక్షించేందుకు అనువుగా ఉండటంతో ఇక్కడికి చేరుకుంటున్నారు.
ఇదీ చదవండి: