Pulichintala projects పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరిగింది. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.42 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 2.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది. విద్యుదుత్పత్తి కోసం 8 వేల క్యూసెక్కులు మళ్లిస్తున్నారు. ప్రస్తుత నీటినిల్వ 37.90 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు.
Somashila projects మరోవైపు నెల్లూరు జిల్లాలోని సోమశిల నిండుకుండను తలపిస్తోంది. దీని పూర్తి నీటిమట్టం 77.98 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 70.15 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి సోమశిలకు 15,782 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఉత్తర, దక్షిణ కాల్వల ద్వారా దిగువకు 9,553 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
ఇవీ చదవండి: