నెల్లూరు నగరంలో జీజీహెచ్ది నాలుగు జిల్లాల స్థాయి కోవిడ్ కేంద్రం. ఈ ఆస్పత్రిలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ బాధితులు పెరిగిపోతున్నారు. ఇప్పటికి వెయ్యి మందికిపైగా ఉన్నారు. అయితే కొవిడ్ బాధితుల నుంచి వచ్చే ఆహార వ్యర్థాలను, ప్లాస్టిక్ బాటిల్స్, మాస్క్‌లను బహిరంగంగా ఆస్పత్రి ఆవరణలోనే కట్టలుగా పడేస్తున్నారు. క్వారంటైన్ గదుల వెనుకవైపున ప్లాస్టిక్ సంచుల్లో కట్టి కుప్పలుగా వేస్తున్నారు.
బహిరంగ ప్రదేశంలో ఇలా పడవేస్తున్న కారణంగా ఆస్పత్రికి వచ్చే రోగులు భయానికి లోనవుతున్నారు. సంచులను కుక్కలు బయటకు తీసుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ చెత్తను బయో మెడికల్ ప్లాంట్స్‌కు తరలించాల్సి ఉంది. జిల్లాలో నాయుడుపేటలో ఒక్క ప్లాంట్ మాత్రమే ఉంది. ఈ ప్లాంట్‌లో సమస్య నెలకొనడంతో చెత్తను ఆస్పత్రి ప్రాంగణంలోనే వేస్తున్నారు. వీటిని తరలించేందుకు పారిశుద్ధ్య కార్మికులు కూడా భయపడుతున్నారు. పీపీఈ కిట్లు, సిరంజ్‌లు వంటివి తప్పకుండా బయో మెడికల్ ప్లాంట్‌కు తరలిస్తున్నామని శానిటైజేషన్ నిర్వహకులు చెబుతున్నారు. ఇతర సాధారణ వ్యర్థాలను మాత్రం పారిశుద్ధ్య కార్మికులు తీసుకెళుతారని అన్నారు.
ఇదీ చదవండి: