Movie style theft: సినిమాల ఎఫెక్ట్ మనుషుల మీద చాలా ఎక్కువగానే కనిపిస్తోంది. సినిమాల్లోనే మాదిరిగానే నిజ జీవితంలోనూ అలాంటి పని చేసి చూపిస్తున్నారు కొందరు. తగ్గేదేలే అంటున్నారు. తమిళ్ హీరో సూర్య 'గ్యాంగ్' సినిమాను చూశారా. అదేనండి సూర్య సీబీఐ ఆఫీసర్‌గా నమ్మించి నగల దుకాణంలోని నగలన్నీ కొట్టేస్తాడు. గుర్తొచ్చిందా. ఇదిగో అచ్చం అలాగే చేసేందుకు ఓ గ్యాంగ్ ప్లాన్ చేసింది. అంతేకాదు రంగంలోకి దిగింది. తీరా పని పూర్తయి సంతోషంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. చివరి నిమిషంలో గ్యాంగ్ స్థానికులకు దొరికింది. ఇంతకీ ఇదంతా ఎక్కడ, ఎలా జరిగిందంటే..
నెల్లూరు జిల్లాలో సినీ ఫక్కీలో చోరీకి ప్రయత్నింది ఓ దొంగల ముఠా. ఐటీ అధికారుల పేరుతో భారీ చోరీ చేసేందుకు దుండగులు ప్రణాళిక రచించారు. నెల్లూరు కాకర్లవారి వీధిలోని లావణ్య జ్యువెలర్స్‌లో ప్లాన్ అమలుకు సిద్ధపడ్డారు. తనిఖీల పేరుతో షాపులో హడావుడి చేశారు. సుమారు 12 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. బంగారంతో ఉడాయించేందుకు యత్నించిన వారిని స్థానికుల సాయంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ చోరీలో ఆరుగురు పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి విచారణ జరిపి నిందితులను రిమాండ్‌కు తరలిస్తామన్నారు.
ఇవీ చదవండి: