నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు నగరం మాఫియాలకు అడ్డాగా మారిందని అన్నారు. నెల్లూరులో భూమి, మద్యం, ఇసుక, బెట్టింగ్ మాఫియా పెరిగిందని అభిప్రాయపడ్డారు. మాఫియా ఆగడాలు చెప్పలేక వేల కుటుంబాలు కుమిలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో నలుగురు ఎస్పీలు మారిన ఘనత నెల్లూరుకే దక్కిందని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి : ముట్టుకొని చెప్పేస్తాడు... వాసన చూసి పసిగట్టేస్తాడు..!