నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ లో... గూడ్స్ రైలు కింద రెండు ప్రాణాలు బలికావల్సిన సంఘటన అది. కానీ.. ఏదో అదృశ్య శక్తి ఆ ఇద్దరిని కాపాడినట్లుగానే.. వారు బయటపడ్డారు. బుధవారం ఉదయం 6.32 గంటలకు ఓ వ్యక్తి గార్డు కంపార్ట్ మెంట్ ఎక్కేెందుకు స్టేషన్ కు వచ్చాడు. రైల్వే సిబ్బంది చూడకుండా ఒంగోలు వైపు వేగంగా వెళ్తున్న గూడ్స్ వెనుకవైపు ఎక్కేందుకు ప్రయత్నించాడు. వేగాన్ని అందుకోలేక పట్టాలపై పడ్డాడు.
కాపాడబోయి..
అతన్ని గమనించిన రూప్ కుమార్ అనే రైల్వే ఉద్యోగి.. ఆ యువకుడి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించి అతను సైతం పట్టాలుపై పడ్డాడు. ప్రమాదవశాత్తు జారి పడిన వీరిద్దరూ మృత్యువుకు దగ్గరగా వెళ్లొచ్చారు. చివరికి స్వల్ప గాయాలతో బతికి బయటపడ్డారు. అక్కడే ఉన్న రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు వారు క్షేమంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి:
కొవిడ్ రెండో ఉద్ధృతికి జులైలో తెర!
నెల్లూరు జీజీహెచ్లో సీటీస్కాన్, ఎంఆర్ఐ ప్రారంభించిన సీఎం జగన్