పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన అతడికి గత నెల 28న తీవ్ర జ్వరం వచ్చింది. ఆస్పత్రికి వెళ్లగా... నమూనాలు సేకరించి హోం ఐసోలేషన్‌లో ఉండమని ఇంటికి పంపారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం హైద్రాబాద్‌కు వెళ్ళాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. కాగా బుధవారం అతని వివాహం జరగాల్సి ఉంది. మృతి చెందిన యువకుడు స్టీల్ సామాగ్రి అమ్ముతూ జీవనం సాగించేవాడు.
ఇదీ చదవండి