ETV Bharat / city

ఒలింపిక్స్​లో దేశానికి పసిడి సాధనే లక్ష్యం: యువ బాక్సర్​ శ్రీకర్​ - కర్నూల్​ లేటెస్​ అప్​డేట్​

boxer Srikaracharya: మూడేళ్ల క్రితం అతడో సాధారణ విద్యార్థి... ఇప్పుడు జాతీయ స్థాయిలో పేరొందిన బాక్సర్... అతి తక్కువ కాలంలోనే కఠోర శ్రమతో ఛాంపియన్​గా పేరు సాధించాడతడు... గోవాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పసిడి సాధించి అందరి మన్ననలు పొందారు... ఇప్పుడు అంతర్జాతీయ పోటీలకు ఎంపికై ఆకాశమే హద్దుగా సాగిపోతున్న విద్యార్థిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

boxer Srikaracharya
యువ బాక్సర్
author img

By

Published : Feb 9, 2022, 2:09 PM IST

Young boxer Srikaracharya: అతడు విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు... విద్యనభ్యసించే సమయంలో బాక్సింగ్​ నేర్చుకోవడం ప్రారంభించాడు పులి పంజాలా పంచ్​లు విసురుతూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. పసిడి పతకం కూడా సాధించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి ఎంపికై ఔరా అనిపిస్తున్నాడు. అతడే కర్నూలుకు చెందిన శ్రీకరాచార్యులు.

Young boxer: బాక్సింగ్‌లో శ్రీకర్‌లోని ప్రతిభను గుర్తించిన కోచ్... ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 2017 నుంచి శిక్షణ తీసుకుంటున్న శ్రీకర్‌... 2018 నుంచి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాడు. 2018 జనవరిలో నంద్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్​లో మొదటిసారి పాల్గొని కాంస్యం సాధించాడు. 2019లో కర్నూలులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించించాడు. అదే ఏడాది రాజంపేటలో రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణం, గుజరాత్ గాంధీనగర్​లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రజతం సాధించాడు. 2020 డిసెంబర్​లో విశాఖలో రాష్ట్రస్థాయిలో పసిడి లభించింది.

Srikaracharya: జనవరి 2021లో హైదరాబాద్​లో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో కాంస్యం పొందాడు. అదే ఏడాది బనగానపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పసిడి సాధించాడు. గతేడాది డిసెంబరులో గోవాలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించి, అంతర్జాతీయస్థాయి పోటీలకు ఎంపికై శభాష్ అనిపించుకున్నాడు.

తన తల్లిదండ్రులు, కోచ్​ ప్రోత్సాహంతోనే ఇవన్నీ సాధించాను. మరింతగా శ్రమించి ఒలింపిక్స్‌లో దేశానికి బంగారు పతకం తీసుకురావాలన్నదే నా లక్ష్యం -శ్రీకర్‌

బాక్సింగ్‌ అంటే రిస్క్‌తో కూడుకున్నదని భావించిన శ్రీకర్‌ తల్లిదండ్రులు మొదట్లో పెద్దగా ప్రోత్సహించలేదు. శ్రీకర్‌ ఇష్టాన్ని గ్రహించి ప్రోత్సహించాం. నా కుమారుడు సాధిస్తున్న విజయాలు చూస్తే గర్వంగా ఉంది -తల్లిదండ్రులు

ఇది చదవండి: 'పిల్లలకే కాదు..ప్రభుత్వానికీ పాఠాలు చెబుతాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.