ETV Bharat / city

తుంగభద్ర పుష్కరాలు : ఐదో రోజూ అంతంత మాత్రమే! - భక్తులు లేక వెలవెలబోతున్న తుంగభద్ర పుష్కర ఘాట్లు

తుంగభద్ర పుష్కరాలు ఐదో రోజు ముగిశాయి. కరోనా భయంతో భక్తులు సంఖ్య అంతంతమాత్రంగానే ఉంటుంది. కార్తిక మాసంలోనూ భక్తుల సందడి ఏమాత్రం కనిపించటం లేదు. మంగళవారం... ఘాట్లన్నీ బోసిపోయాయి. ఇవాళ ముగ్గురు భక్తులు, ఇద్దరు పోలీసులకు కరోనా సోకింది. దీంతో పుష్కరాల్లో ఇప్పటి వరకూ 10 మందికి కరోనా సోకింది.

తుంగభద్ర పుష్కరాలు
తుంగభద్ర పుష్కరాలు
author img

By

Published : Nov 24, 2020, 10:05 PM IST

తుంగభద్ర పుష్కరాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని అధికారులు భావించారు. 23 ఘాట్లు నిర్మించారు. పోలీసులు, అధికారులు పుష్కరాలను విజయవంతం చేసేందుకు సమయాత్తమయ్యారు. జిల్లా యంత్రాంగం సహా పొరుగు జిల్లాల పోలీసులు భారీగా ఘాట్ల వద్ద మోహరించారు. తీరా పుష్కరాలు ప్రారంభమై... ఐదు రోజులైనా... భక్తుల నుంచి స్పందన కానరావటం లేదు. పుష్కర స్నానాలు లేవని, పూజలు, పిండప్రదానాలు మాత్రమే చేసుకోవాలని ప్రభుత్వం పదేపదే ప్రచారం చేయటం, ఈ- టికెట్ తీసుకోవాలని చెప్పటం సహా కరోనా భయం కారణంగా... భక్తుల సంఖ్య భారీగా పడిపోయింది. ఫలితంగా ఘాట్లన్నీ వెలవెలబోతున్నాయి.

మరో ఐదుగురికి కరోనా

నదిలో నీరు లేకపోవటంతో భక్తుల నుంచి అంతగా ఆసక్తి చూపడంలేదు. నీరు మురికిగా ఉండడంతో భక్తుల సంఖ్య తగ్గుతోంది. ఫలితంగా ఘాట్ల వద్ద సందడి లేదు. వచ్చినవారు జల్లు స్నానాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నా... వాటి కింద కూడా పెద్దగా ఎవరూ కనిపించటం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కేవలం పదుల సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. మరోవైపు సంకల్ బాగ్ పుష్కర ఘాట్​లో మంగళవారం ఒక్కరోజే ఐదుగురికి కరోనా పాజిటివ్ రావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముగ్గురు భక్తులు, ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో ఇప్పటి వరకు పుష్కరాల్లో 10 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో ఆరుగురు పోలీసులు ఉండటం గమనార్హం.

ప్రత్యేక పూజలు, పంచహారతులు

తుంగభద్ర పుష్కరాల ఐదో రోజు కర్నూలు నగరంలోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్​లో తుంగభద్ర తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. పంచహారతులు ఇచ్చారు. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు నగరవాసులు ఆసక్తి చూపారు.

ఇదీ చదవండి :

రాష్ట్రపతి పర్యటనలో పలువురు ముఖ్య అధికారులకు చేదు అనుభవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.