చికిత్స కోసం ఎవరూ ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లొద్దని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా కరోనా సోకిన వారు వేగంగా కోలుకుంటున్నారని... ఏ ఒక్కరు కూడా వెంటిలేటర్‌పై లేరని వెల్లడించారు. ఎలాంటి జబ్బుకైనా మొదట ప్రభుత్వ ఆస్పత్రికి రావాలని... పరీక్షలు చేయించుకుకోవాలని పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీ నాయకులతో అఖిల పక్ష భేటీ నిర్వహించాలన్న తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాష్ట్రంలో లేరని.. అఖిలపక్ష భేటీ ఎక్కడ పెట్టాలని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో కూర్చొని ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని అన్నారు.
ఇదీ చదవండి: