ETV Bharat / city

రామతీర్థం ఘటనను రాజకీయంగా వాడుకుంటున్నారు: మంత్రి బొత్స

రామతీర్థం ఘటనను తెదేపా రాజకీయంగా వాడుకుంటోందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.

రామతీర్థం ఘటనను రాజకీయంగా వాడుకుంటున్నారు

author img

By

Published : Dec 31, 2020, 8:35 PM IST

రామ తీర్థం ఘటనను తెదేపా రాజకీయంగా వాడుకుంటోందని పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఆరోపించారు. ప్రతీ అంశాన్నీ రాజకీయం చేయాలంటే కుదరదని ఆయన తెదేపాకు హితవు పలికారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఉచిత ఇళ్లపట్టాల పంపిణీలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న తెదేపా దాన్ని నిరూపించాలని మంత్రి డిమాండ్ చేశారు.

సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కాలేదన్నారు. కరోనా మహమ్మారిని సమర్థంగా నియంత్రించగలిగామని మంత్రి బొత్స వెల్లడించారు. 30.75 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వవటం విప్లవాత్మకమని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ..కుట్రలతో ప్రతీ పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఇదీచదవండి

రామతీర్థం ఘటనపై ఆగ్రహజ్వాలలు.. ప్రభుత్వ తీరుపై విమర్శలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.