రాష్ట్రంలో అంతర్జాతీయ లెదర్ పార్క్‌ను నెలకొల్పనున్నట్లు లెదర్ ఇండస్ట్రీస్ డవ్‌లప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్- లిడ్ క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ తెలిపారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన... సుమారు 500 ఎకరాల్లో లెదర్ పార్కును ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కృషి చేస్తున్నామని, లిడ్ క్యాప్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తామని వివరించారు.
ఇదీచదవండి.