కర్నూలులో కూరగాయల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమెదు అవుతున్నందున నగరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 32 రైతు బజార్లను ముసివేసి.... నగరానికి 5 కిలోమీటర్ల దురంలో ఉన్న పెద్దపాడు వద్ద అధికారులు కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. కర్నూలు నగరంలో కూరగాయలు అందుబాటులో లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోల్లో కూరగాయలు తెచ్చి వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో మాదిరి ఎక్కువ సంఖ్యలో మార్కెట్లను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో 314కు చేరిన కరోనా కేసులు