Girl died with snake bite : కర్నూలు జిల్లా గడివేముల మండలం బిలకలగూడూరులో విషాదం చోటు చేసుకుంది. మనుమరాలు పాము కాటుతో మృతి చెందడం తట్టుకోలేని నానమ్మ గుండెపోటుతో చనిపోయింది. ఈ వరుస ఘటనలతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈనెల 17న పొలం పనులు చేస్తుండగా మనుమరాలు రాణెమ్మ పాము కాటుకు గురైంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మనుమరాలి మృతిని తట్టుకోలేక నానమ్మ వెంకట లక్ష్మమ్మ.. గుండె పోటుతో మరణించారు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి : Tiger Appeared on Road in Nallamala Forest : నల్లమల అటవీ దారిలో పులి ప్రత్యక్షం...లారీకి అడ్డుగా వచ్చిన క్రూరమృగం..