కరోనా సమయంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అనడంపై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ స్పందించారు. బుగ్గన ఓవర్ డ్రాఫ్ట్ కోసం ఏ నెలలో రిజర్వ్ బ్యాంకుకు వెళ్లలేదో చెప్పాలని ప్రశ్నించారు. కర్నూలులో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తే.. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో పరిపాలన సాగడం లేదని.. ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు. కరోనాకు అందించే వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని కోరారు.
'రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన సాగడంలేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఆలోచించాలి. అంతమంది పదో తరగతి పరీక్షలు వద్దంటున్నా ఎందుకు మొండిగా ఉంటున్నారు. పిల్లలకు కరోనా సోకితే బాధ్యత ఎవరు వహిస్తారు. కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలి. అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలి.'-- శైలజానాథ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు
-
ఇవీ చదవండి: