కర్నూలు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అధికారులను అప్రమత్తం చేశామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా.... ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కర్నూలు నగరానికి గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని.. సాయంత్రానికి 40 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. వరద నీరు ఉద్ధృతి పెరిగితే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పారు.
ఇదీ చదవండి :