- మందు బాబులకు శుభవార్త
మందు బాబులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మద్యం ధరల్ని తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ధరలు తగ్గిస్తూ సవరించిన నోటిఫికేషన్‌ను అబ్కారీశాఖ విడుదల చేసింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విచారణ వాయిదా
సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల విచారణ నవంబరు 2కు వాయిదా పడింది. సీబీఐ కేసు తేలిన తర్వాత.. లేదా ఒకేసారి విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తగ్గుముఖం
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,905 కరోనా కేసులు, 16 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,17,679కి చేరింది. వైరస్ కారణంగా మృతి చెందినవారి సంఖ్య 6,659 కి ఎగబాకింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బయటపడిన శివాలయం
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో పెన్నా నది ఒడ్డున పురాతన శివాలయం బయటపడింది. అలాగే ఆ ప్రాంతంలో శిలా శాసనం, పురాతన విగ్రహాలను కేంద్ర పురావస్తు శాఖ గుర్తించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సంచలన ప్రకటన
బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు భాజపాకు ఓటు వేయడానికి వెనుకాడమన్నారు. పార్టీకి షాక్ ఇచ్చిన ఏడుగురు రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'చైనాను వెళ్లగొట్టలేరు కానీ.. కశ్మీర్‌ను కొల్లగొడతారా?'
కార్పొరేట్ల కోసం కశ్మీరీల భూమిని లాక్కోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. భారత భూభాగం నుంచి చైనాను వెనక్కి పంపాలని హితవు పలికారు. కశ్మీర్‌ను కొల్లగొట్టాలని చూసే వారి ఆలోచనలు సఫలం కానివ్వబోమన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఖరీదైన ఎన్నికలు!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2020 ఆ దేశ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కనున్నాయి. ఈ ఏడాది ఎన్నికల్లో దాదాపు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయనున్నట్లు సెంటర్ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ సంస్థ నివేదించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మరింత గడువు!
ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాలో వాటాల విక్రయానికి మరోసారి గడువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 30తో ప్రస్తుత గడువు ముగియనున్న నేపథ్యంలో.. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- సర్జరీ తర్వాత అభిమానుల ముందుకు
ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్న కపిల్‌దేవ్.. అభిమానుల్ని వీడియో ద్వారా పలకరించారు. తాను బాగానే ఉన్నట్లు చెప్పారు. తన సహచర క్రికెటర్లను త్వరలో కలవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- టైటిల్ మార్పు
అక్షయ్ కుమార్ కొత్త సినిమా టైటిల్లో మార్పు చేస్తూ చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. 'లక్ష్మి' పేరుతోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.