ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5pm

.

author img

By

Published : Jul 1, 2021, 5:04 PM IST

TOPNEWS
ప్రధాన వార్తలు @ 5pm
  • భద్రత పెంపు

తెలుగురాష్ట్రాల మధ్య మళ్లీ జలవివాద పరిస్థితులు తలెత్తాయి. నాగార్జునసాగర్, పులిచింతలప్రాజెక్టుల వద్ద పోలీసుల మోహరింపుంతో...ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఏపీ అనుమతి లేకుండానే తెలంగాణ జెన్​కో...విద్యుదుత్పత్తి ప్రారంభించటంతో వివాదం మొదలైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • డెల్టా వేరియంట్ కలకలం

విశాఖలో(vizag) కరోనా డెల్టా వేరియంట్(corona delta variant) కేసు నమోదవడం కలకలం రేపింది. వాంబే కాలనీకి చెందిన ఓ మహిళలో ఈ వైరస్(virus)​ను గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆమె కుటుంబసభ్యులంతా ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఏసీబీకి చిక్కారు

విశాఖ జిల్లా చోడవరం తహసీల్దార్ రవికుమార్, డిప్యూటీ తహసీల్దార్ రాజా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. రూ.4.5 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు రవికుమార్‌, రాజా చిక్కారు. ఏసీబీ అధికారులు.. చోడవరం తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • రామోజీ ఫౌండేషన్​కు మంత్రుల కృతజ్ఞతలు

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ నూతన భవనానికి ఆ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రామోజీ ఫౌండేషన్​ సహకారంలో ఈ పీఎస్​ను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రామోజీ ఫౌండేషన్​కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'వైద్యుల సేవలు భళా!'

కరోనాపై పోరులో వైద్యుల కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. మహమ్మారిపై విజయం సాధించడంలో వారి అనుభవాలు ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. వైద్య రంగ బడ్జెట్​ను రెట్టింపు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మొసలి హల్​చల్​

కర్ణాటకలోని ఓ గ్రామంలో భారీ మొసలి హల్‌చల్‌ చేసింది. దండేలీ జిల్లా కొగిల్‌బాన్‌ గ్రామంలోకి ప్రవేశించి.. అక్కడి వీధుల్లో తిరుగుతూ భయాందోళనకు గురిచేసింది. గ్రామంలో ప్రమాదకరంగా సంచరిస్తున్న మొసలిని చూసి అవాక్కైన గ్రామస్థులు.. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వందేళ్ల వేడుకలు

చైనా కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బీజింగ్​లోని తియనన్మెన్ స్క్వేర్​లో భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించారు. సైనికుల కవాతు, వైమానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్.. సైన్యం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ధరెంతో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల కార్లు ఉన్నాయి. మామూలు కార్లు లక్షలు పలుకుతుంటే విలాసవంతమైనవి కోట్లు విలువ చేస్తాయి. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ఏదో తెలుసా? దాని ధర ఎంత ఉంటుందో ఊహించగలరా? రోల్స్​ రాయిస్​ సంస్థ కేవలం ముగ్గురు కస్టమర్ల కోసం తయారు చేసిన ఆ కారు వివరాలు మీకోసం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆస్ట్రేలియా క్రికెటర్లు వచ్చేస్తున్నారు!

ద్వైపాక్షిక సిరీస్​ల కారణంగా యూఏఈలో జరగబోయే ఐపీఎల్​ మిగిలిన మ్యాచ్​ల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనడం అనుమానం అంటూ వార్తలు వచ్చాయి. అయితే అదే యూఏఈలో టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తుండటం వల్ల లీగ్​కు రావడమే మంచిదని భావిస్తున్నారట ఆసీస్ క్రికెటర్లు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మూవీ ముచ్చట్లు

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. ఫహాద్​ ఫాజిల్​ 'మాలిక్'​ ఓటీటీ రిలీజ్​తో పాటు పునీత్​ రాజ్​కుమార్​, తేజా సజ్జాల కొత్త సినిమా టైటిల్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.