Murder in Kakinada: కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడ గ్రామంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన కాకినాడ ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిశ చట్టం ప్రకారం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నేరం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.
10లక్షల ఆర్థికసాయం: బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి జగన్ 10లక్షల రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. త్వరగా కేసు విచారణ పూర్తిచేసి ఛార్జిషీటు దాఖలు చేయాలని సూచించారు.
యువతి కుటుంబ సభ్యులను.. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. మహిళా కమిషన్ తరఫున మృతురాలి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. యువతిని హత్య చేసిన నిందితుడు సూర్యనారాయణపై రౌడీషీట్ తెరుస్తామని కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. హత్యోదంతంపై వివరాలు ఎస్పీ వెల్లడించారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామన్నారు.
ఇవీ చదవండి: