కాకినాడలో ఏపీ అమరావతి ఐకాస అధ్యక్షుడు బొప్పరాజు మీడియా సమావేశం నిర్వహించారు. 11వ పీఆర్సీతో ప్రభుత్వానికి అదనపు భారం ఉండదన్న బోపరాజు.. ఉగాదికి పీఆర్‌సీ ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని అన్నారు. తెలంగాణలో మాదిరిగానే రాష్ట్రంలోనూ పీఆర్సీని ప్రకటించాలి డిమాండ్ చేశారు.
సీఎఫ్‌ఎంఎస్ ఉద్యోగుల పాలిట వరమో, శాపమో తెలియడం లేదన్న బొప్పరాజు.. ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన డబ్బు నిలిపివేయడం సరికాదని అన్నారు. విశ్రాంత ఉద్యోగులకు వచ్చే బెనిఫిట్స్‌లోనూ కోత విధించడం దారుణమని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్థిక శాఖ స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.