ETV Bharat / city

viveka case: హత్యకు వాడిన ఆయుధాలపై ఆరా.. దస్తగిరిని కూడా పిలిచిన అధికారులు

viveka murder case: తొలిసారి సీబీఐ విచారణకు హాజరైన విజయశంకర్ రెడ్డి

author img

By

Published : Sep 18, 2021, 11:45 AM IST

Updated : Sep 18, 2021, 2:50 PM IST

11:40 September 18

హత్యకు వాడిన ఆయుధాలపై ఉమాశంకర్‌రెడ్డిని ప్రశ్నిస్తున్న సీబీఐ

వైఎస్ వివేకా హత్య కేసులో 103వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది.  కడప జిల్లా జమాలపల్లి వాసి విజయశంకర్‌ రెడ్డి విచారణకు హాజరయ్యారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో అధికారులు విజయశంకర్​ రెడ్డిని విచారిస్తున్నారు. ఆయన విచారణకు హాజరుకావడం ఇదే తొలిసారి. నిందితుడు ఉమాశంకర్​రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు వాడిన ఆయుధాలపై సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. 20 రోజుల క్రితం మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు మళ్లీ విచారణకు పిలిచారు. ఉమాశంకర్‌రెడ్డిని విచారిస్తున్న సందర్భంగా దస్తగిరిని పిలిచినట్లు తెలుస్తోంది. గురు, శుక్రవారాల్లో కూడా సీబీఐ అధికారులు ఉమాశంకర్ రెడ్డిని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో (viveka murder case) ఉమాశంకర్‌రెడ్డి పాత్రను సునీల్‌యాదవ్‌, దస్తగిరి తమ వాంగ్మూలంలో ధ్రువీకరించారు. 

'హత్యకు ఆటంకం కలిగిస్తుందేమోనన్న అనుమానంతో.. వివేకా ఇంటి సమీపంలో ఉండే కుక్కను సునీల్‌యాదవ్‌తో కలిసి ఉమాశంకర్‌రెడ్డి తన కారుతో గుద్ది చంపారు. ఆగస్టు 11న ఉమాశంకర్‌రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు తెలుపు, లేత నీలం రంగు చొక్కాలను, సునీల్‌ యాదవ్‌, ఇతర అనుమానితుల ఇంట్లో రక్తపు మరకలతో కూడిన చొక్కాలను స్వాధీనం చేసుకున్నాం. వాటికి సంబంధించి చండీగఢ్‌లోని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ నుంచి నివేదిక రావాల్సి ఉంది. వివేకా హత్యకు ఉపయోగించిన గొడ్డలి లేదా ఇతర ఆయుధాలను గుర్తించే ప్రయత్నాలు ఇప్పటికీ ఫలించలేదు. ఉమాశంకర్‌రెడ్డిని గురువారం విచారణకు పిలిచి కీలక అంశాలపై ప్రశ్నించగా సరైన సమాధానాలు ఇవ్వలేదు. అతనికి తెలిసిన విషయాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో కీలక ఆధారాలు సేకరించేందుకు, హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు అతణ్ని కస్టడీలోకి తీసుకోవడం చాలా అవసరం’ అని కస్టడీ పిటిషన్‌లో సీబీఐ పేర్కొంది.

కడప జిల్లా సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పులివెందుల ఆర్టీసీ బస్టాండు ఎదురుగా మహాశివగంగభవాని పాల డెయిరీ నిర్వహిస్తున్నారు. అతను వివేకా వ్యక్తిగత కార్యదర్శిగా ఉంటూ పొలం పనులు చూసే జగదీశ్వర్‌రెడ్డికి తమ్ముడు. వీరికి మొదటి నుంచి వివేకా, ఆయన కుటుంబసభ్యులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సింహాద్రిపురం మండలం రావులకొలనులో వివేకా పొలాలను, మినీ పాల కేంద్ర నిర్వహణ బాధ్యతలను జగదీశ్వర్‌రెడ్డి చూస్తున్నారు. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న సునీల్‌కుమార్‌యాదవ్‌ను ఉమాశంకర్‌రెడ్డే వివేకాకు పరిచయం చేసినట్లు సమాచారం.

ఇదీ చదవండి:  Viveka murder case: నిందితుడు ఉమాశంకర్‌రెడ్డిని విచారిస్తున్న సీబీఐ

Last Updated : Sep 18, 2021, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.