"పంటి నొప్పికి తుంటి మీద తన్నినట్టుంది జగన్ పాలన" అని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. 13 జిల్లాలను విడగొట్టి 26 జిల్లాలు చేసి, ఇదే అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ అని డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని మండిపడ్డారు. 73, 74 రాజ్యాంగ సవరణల మేరకు గ్రామ పంచాయతీలు, తదితర స్థానిక ప్రభుత్వాలకు విధులు, నిధులు, అధికారాలు బదలాయిస్తే అది నిజమైన పాలనావికేంద్రీకరణ అవుతుందని పేర్కొన్నారు. గాలేరు నగరి, పోలవరం తదితర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ప్రత్యేక హోదా సాధించి ప్రతి జిల్లాలో పరిశ్రమలు సాధిస్తే అది నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందని, అవి చేయకుండా.. 13 జిల్లాలైనా, 26 అయినా,175 అయినా ప్రయోజనం లేదని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: Pawan Kalyan: ప్రజాభిప్రాయం పరిగణించకుండా జిల్లాల విభజన: పవన్‌కల్యాణ్