.
ఒంటిమిట్టలో కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి... పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం - ఒంటిమిట్ట లేటెస్ట్ అప్డేట్స్
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడి కల్యాణ మహోత్సవానికి తితిదే ఏర్పాట్లు దాదాపు పూర్తి చేసింది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరై... స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. రూ.16 కోట్లతో నిర్మించిన శాశ్వత కల్యాణ వేదికలో తొలిసారి జరుగుతున్న కల్యాణం సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు భారీగా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. 50 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేలా కల్యాణ వేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముడు
.
TAGGED:
vontimitta latest updates