కొవిడ్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని.. లేదంటే పూర్తిస్థాయిలో తగ్గిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. నూతన విధానం వల్ల విద్యా వ్యవస్థ కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆరోపించారు. కొవిడ్‌తో మరణించిన 101 మంది ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలకు ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కడప ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌తో మృతిచెంది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు దహన సంస్కారాలు ఇవ్వాల్సిన 15000 రూపాయలు ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. రాయలసీమ వ్యాప్తంగా నాలుగు జిల్లాల్లో పర్యటించి.. కొవిడ్‌తో మృతిచెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను పరామర్శించానని తెలిపారు. ఆ కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యానికి రెండు లక్షల నుంచి 45 లక్షల వరకు ఖర్చు పెట్టుకున్న కుటుంబాలకు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ... YSR Beema: సాధారణ మరణానికి రూ.లక్ష.. ప్రమాదంలో చనిపోతే రూ.5 లక్షలు సాయం!